సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలసి సందర్శించి, ప్రాంగణంలో నెలకొన్న సమస్యల గురించి అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించారు.
పాఠశాల పరిసర ప్రాంతం పూర్తిగా చెత్తచెదారంతో నిండిపోయిందని, అధ్వానంగా మారిన మరుగుదొడ్లను త్వరలోనే బాగుచేయిస్తానని హామీ ఇచ్చారు. దాతల సాయంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. విద్యార్థుల ఇబ్బందులను విద్యాశాఖ మంత్రికి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభంకానున్నందున... విద్యార్థులుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మహాత్మునికి ప్రముఖుల నివాళి...