హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యత గల పట్టభద్రులందరూ పాల్గొనాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసి.. మూడేళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు వేసేందుకు అర్హులే అని.. వారంతా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఈ మేరకు.. ఆయన గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలో నివసిస్తున్న గ్రాడ్యుయేట్లను గుర్తించి.. పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: క్రెడిట్ కార్డు సైజులో ఆధార్.. అప్లై ఇలా..