ETV Bharat / city

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస సరికొత్త రికార్డు: తలసాని - ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గం గాంధీనగర్​ డివిజన్​లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

minister talasani srinivas yadav starteded voter enrollment in musheerabad
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస సరికొత్త రికార్డు: తలసాని
author img

By

Published : Oct 4, 2020, 6:27 PM IST

పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస కొత్త రికార్డు నెలకొల్పడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ హిమసాయి అపార్ట్​మెంట్​లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను... ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి మంత్రి ప్రారంభించారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ఏ ఒక్క పట్టభద్రుని పేరు కూడా మిస్​ కాకుండా నమోదు చేయించి, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ముఠా పద్మానరేష్, నాయకులు ఎంఎన్​ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హోం మంత్రి సమక్షంలోనే తెరాస నేతల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.