ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనమే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విపక్షాలు చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారని... రేపు పుర సమరంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని వ్యాఖ్యానించారు. జానారెడ్డి గెలిస్తే భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతాడని కాంగ్రెస్ ప్రచారం చేసినా ప్రజలు ఇంటికే పంపించారని మంత్రి తెలిపారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. ఇకనైనా భాజపా నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ప్రతిపక్షాలు తెరాస నేతలపై వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హితవు పలికారు. నాగార్జునసాగర్‌లో కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం