దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ... తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ... అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నట్టు తెలిపారు. అంతే కాకుండా... వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
సర్కారు దవాఖానాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో... బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంత కుమారి, తహసీల్దార్ బాలశంకర్ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, కుర్మ హేమలత పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై కేటీఆర్ హర్షం