ETV Bharat / city

సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్​ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. గ్రేటర్​ ఎన్నికలతో సంబంధం లేని అంశాలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయని మంత్రి విమర్శించారు.

Minister Talasani reviewed the arrangements for the CM's public meeting
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
author img

By

Published : Nov 27, 2020, 4:16 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలతో సంబంధం లేని అంశాలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తూ ప్రచారం గావిస్తున్నాయని మంత్రి తలసాని ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సభలో అన్ని డివిజన్ల అభ్యర్థులు, పార్టీ క్యాడర్, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

ఆరేళ్లలో ప్రభుత్వ పనితీరు, భవిష్యత్తులో నగరాభివృద్ధి ప్రణాళికలపై ఈ సభ ద్వారా సీఎం దిశానిర్దేశం చేస్తారని తలసాని ప్రకటించారు. హైదరాబాద్​తో సంబంధంలేని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయటమేంటని ఎద్దేవా చేశారు.

సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని

ఇవీ చూడండి: 'పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.