ETV Bharat / city

బియ్యం, నగదు పంపిణీపై మంత్రి తలసాని సమీక్ష - జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్

లాక్​డౌన్​ కారణంగా హైదరాబాద్​లో చిక్కుకుపోయిన వలస కార్మికులందరికీ బియ్యం, నగదు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో నిత్యవసరాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

minister talasani review
బియ్యం, నగదు పంపిణిపై మంత్రి తలసాని సమీక్ష
author img

By

Published : Apr 13, 2020, 4:55 PM IST

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. లాక్​డౌన్​ కారణంగా హైదరాబాద్​లో చిక్కుకుపోయిన వలస కార్మికులందరికీ బియ్యం, నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వలస కూలీలు, తెల్లరేషన్ కార్డుదారులకు.. బియ్యం, నగదు పంపిణీపై చర్చించారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 35వేల మంది వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ పూర్తైందని... ఇంకా లక్షా 38 వేల మందికి బియ్యం అందాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తలసాని చెప్పారు. వారికి కూడా బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో రేపు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: కరోనా గురించి వారికి ఇంకా తెలియదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.