రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. నగరంలో కురిసే వర్షాలతో వచ్చే వరదల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తమ పరిధుల్లో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. మోండా మార్కెట్లోని నాలా నుంచి నీరు రోడ్డుపైకి వచ్చాయని మంత్రికి ఫిర్యాదు అందింది. మంత్రి తలసాని వెంటనే జీహెచ్ఎంసీ అధికారులను ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశించగా... జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ అధికారులు వెళ్లి నీళ్లు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు.