రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్ - 19 నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు చెప్పడానికి నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావద్దని.. అందుకు బదులుగా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు నాటాలని కోరారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో మొక్కలు నాటారు. పలువురు తెరాస నాయకులు, మంత్రులు, అభిమానులు ఆయనకు ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: 'పరిహార సెస్సు గడువు పొడిగింపునకు అంగీకారం