ETV Bharat / city

హిందువులంటే భాజపా నేతలేనా..? : తలసాని - minister talasani fires on bjp leaders

భాజపా నేతలు తాత్కాలిక లాభం కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. మేయర్‌ ఎన్నికలో ఎంఐఎం మద్దతునివ్వడంపై భాజపా విమర్శలను ఖండించారు.

minister talasani fires on bjp leaders about ghmc mayor election 2021
భాజపాపై తలసాని ఫైర్
author img

By

Published : Feb 12, 2021, 1:19 PM IST

బల్దియా మేయర్ ఎన్నికపై భాజపా వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. తెరాస-ఎంఐఎంల మధ్య పొత్తు ఉంటే మజ్లిస్​కు డిప్యూటీ మేయర్‌ ఇవ్వాలి కదా అని ఎదురు ప్రశ్నించారు. ఒక పార్టీకి ఓటు వేయలేని సభ్యులు... ఇతరులకు మద్దతు ఇవ్వడం ఎక్కడైనా జరిగేదే అన్నారు.

భాజపాపై తలసాని ఫైర్

ఒకేసారి రెండు పదవులూ మహిళలకే దక్కడం హర్షణీయమన్న మంత్రి.. పడతికి పట్టం కడితే అభినందించకుండా విమర్శిస్తారా అని మండిపడ్డారు. వెనకబడిన వర్గాల వారిని అన్ని రకాలుగా తెరాస ప్రోత్సహిస్తోందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో భాజపా అనైతికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించారు. పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా కలిసిపోలేదా అని అడిగారు.

దేశంలో హిందువులు అంటే భాజపా నేతలు మాత్రమే కాదని మంత్రి తలసాని అన్నారు. భాజపా నేతలు తాత్కాలిక లాభం కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని గౌరవించే సంస్కారం లేదని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.