తెలంగాణ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి కథలపై లఘుచిత్ర పోటీల 2021 గోడ పత్రికను.. పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్... హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కథా రచయిత, గోల్కొండ పత్రికాధిపతులు, చరిత్రకారుడు పరిశోధకుడు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతిని పురస్కరించుకొని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సురవరం కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ మహనీయుడి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో.. రవీంద్రభారతిలో మే 28న అధికారికంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
జయంతి వేడుకల్లో భాగంగా... భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో.. సురవరం ప్రతాపరెడ్డి రాసిన కథలు, కథానికలను ఆధారం చేసుకొని నిర్మించే లఘుచిత్రాల పోటీలను.. నిర్వహించడానికి నిర్ణయించిందన్నారు. ఔత్సాహిక సినీ నిర్మాత దర్శకుల నుంచి ఈ లఘుచిత్రాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: 'రిజర్వేషన్ల పరిమితి నిర్ణయాధికారం రాష్ట్రాలకివ్వాలి'