బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విలువైన భూములను బీసీల ఆత్మగౌరవ భవనాలకు కేటాయించామని పేర్కొన్నారు. భవనాలకు స్థలాలు కేటాయించిన సీఎం, కేటీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని విమర్శించారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని మంత్రి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. తెలంగాణ తరహాలో కేంద్రం కూడా బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని మంత్రి కోరారు.