ETV Bharat / city

ఫినిక్స్ ఆర్ట్ ఎగ్జిబీషన్​ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - Phoenix Art Exhibition inauguration by Srinivas Goud

తెలంగాణను కళల కాణాచిగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివర్ణించారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫినిక్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్​ను మంత్రి ప్రారంభించారు. కొవిడ్ సమయంలోనూ కళాకారులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Minister Srinivas Goud inaugurates  Phoenix Art Exhibition
ఫినిక్స్ ఆర్ట్ ఎగ్జిబీషన్​ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Nov 7, 2020, 7:01 PM IST

కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కళాకారులను ఆదుకునే ఉద్దేశంతో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫినిక్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్​ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దాదాపు 100 మందికి పైగా కళాకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో పెయింటింగ్, ఫొటోగ్రఫీ, శిల్పకళ తదితర అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు.

ఆర్ట్​ గ్యాలరీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు చేపట్టారని పేర్కొన్నారు. హ్యాండీ క్రాఫ్ట్​ మేళా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వారం రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శన ద్వారా కొవిడ్ సమయంలోనూ కళాకారులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కళల కాణాచిగా తెలంగాణను మంత్రి అభివర్ణించారు. విదేశాల నుంచి కళాకారులు ఇక్కడకు వచ్చి ప్రదర్శనల్లో పాల్గొనేలా మున్ముందు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు.

ఇదీ చూడండి: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.