students and teacher fall on escalator: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ మాక్స్‌లో గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన విద్యార్థులకు గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు గాంధీ సినిమా వీక్షించేందుకు వెళ్లారు. ఎస్కలేటర్‌పై వెళ్తుండగా వేగంగా కదలడంతో 13 మంది విద్యార్థులు, టీచర్ కిందపడ్డారు. ఎస్కలేటర్ నిలిపివేసిన నిర్వాహకులు... వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనలో ఒక విద్యార్థి చేయి, మరో విద్యార్థినికి తలకు స్వల్ప గాయమైనట్లు గుర్తించి చికిత్స అందించారు. బంజారాహిల్స్‌లోని ఆర్‌కే సినీప్లెక్స్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదంపై చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు చిన్నారులకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో దగ్గరుండి చికిత్స చేయించినట్లు తెలిపారు.
గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని పాఠశాల విద్య సంచాలకులు దేవసేనను మంత్రి కోరారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు గాంధీ చిత్ర ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా గాంధీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
ఇవీ చదవండి: