నిజామామాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారీటీయే లక్ష్యంగా తెరాస నేతలు ముందుకెళ్తున్నట్టు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించామన్నారు. 90శాతం ఓటర్లు తెరాస వైపే ఉన్నారని ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమై... భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు వ్యవహరించాల్సిన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి అభ్యర్థి కవిత, ఎంపీలు సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, వీజీ గౌడ్, ఆకుల లలిత, జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఇందూరు ఎమ్మెల్సీ ఉపఎన్నికే లక్ష్యంగా తెరాస వ్యూహాలు