ఇవీచూడండి: రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోసు ఇవ్వాలి: కిషన్ రెడ్డి
విపత్తువేళ పేదలకు సాయం.. లాక్డౌన్ ముగిసే వరకు కొనసాగింపు - భాజపా సేవా హీ సంఘటన్ కార్యక్రమం
కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు పార్టీ పిలుపు మేరకు భాజపా శ్రేణులు 'సేవా హీ సంఘటన్' పేరుతో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా బాధితులకు పార్టీ కార్యకర్తలు ఐసోలేషన్ కేంద్రాలు, ఉచిత మందులు, పౌష్టికాహారం అందజేస్తున్నారు. గతేడాది కోట్లాది మంది ఆపన్నులకు అండగా నిలిచామని... ఈ సారి కూడా అదే విధంగా ముందుకు సాగుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొవిడ్ బాధితులు, పేద ప్రజలకు భాజపా యువ మోర్చ నిర్వహించే ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామంటున్న కిషన్‌రెడ్డితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి
minister of state kishan reddy inaugurate SevaHiSangathan program in hyderabad