ఏ గ్రామం పంటను అదే గ్రామంలో కొనుగోలు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు తీసుకుంటున్న చర్యలు వివరించారు. 12,791 పంచాయతీలకు గానూ... రైతుబంధు సమన్వయ సమితులతో కలిసి 7వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
జంటనగరాల్లోని రైతు బజార్లలో రద్దీ తగ్గించేందుకు 250 సంచార రైతు బజార్లు ఏర్పటు చేసి 500 ప్రాంతాలకు కూరగాయలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల సౌకర్యార్థం మామిడి కొనుగోళ్లను తాత్కాలికంగా కొహెడలో ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఇదీ చూడండి: మందు బాబులకు లిక్కర్ పాసులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం