ETV Bharat / city

Minister Niranjan Reddy : 'మన కూరగాయలు మనమే పండిద్దాం'

సేంద్రీయ సాగుపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారిస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana Agriculture Minister Niranjan Reddy) అన్నారు. రాష్ట్రంలో మిద్దెసాగుకు ఆదరణ ఎక్కువగా ఉందని.. ప్రజాప్రతినిధులంతా కూడా వారి ఇళ్లలో.. క్యాంపు కార్యాలయాల్లో కూరగాయలు పండించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్​ ఎక్కువగా ఉన్నందున ఆ దిశగా కార్యాచరణ రూపొందించి రైతులకు లాభాలు చేకూరేలా ప్రణాళిక రచిస్తామని స్పష్టం చేశారు.

Minister Niranjan Reddy
Minister Niranjan Reddy
author img

By

Published : Oct 7, 2021, 12:23 PM IST

వ్యవసాయంలో క్రమేపీ రసాయనాల వాడకం తగ్గించే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ్ రెడ్డి(Telangana Agriculture Minister Niranjan Reddy) స్పష్టం చేశారు. రైతులకు నెమ్మదిగా సేంద్రీయ సాగును అలవాటు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల పర్యావరణానికి మంచి జరగడమే కాకుండా.. రసాయన అవశేషాలు లేని పంట పండించవచ్చని అన్నారు. ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

సేంద్రీయ ఉత్పత్తులకు అధిక ధరలెందుకు..?

నిషేధిత ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల పంటలో రసాయన అవశేషాలు మిగిలి అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని.. వీటిపై తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న శాసనసమండలిలో ప్రశ్నించారు. ఆర్గానిక్ ఉత్పత్తులు అంటూ మార్కెట్​లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సేంద్రీయ సాగులో పండించిన పంటను గుర్తుపట్టడమెలా? అని ఎమ్మెల్సీ గంగాధర్ మండలిలో ప్రశ్నలేవనెత్తారు. మరోవైపు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి.. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతు వేదికను నిర్మించిన ప్రభుత్వం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం 7వేల ఎకరాలు దాటినా కూడా రైతు వేదిక ఏర్పాటు చేయలేదు ఎందుకు అని ప్రశ్నించారు. వీరి ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana Agriculture Minister Niranjan Reddy) సమాధానం ఇచ్చారు.

సేంద్రీయ సాగుపై పక్కా ప్రణాళిక కావాలి

సాగులో రసాయన ఎరువులను వాడొద్దని ఒక్కసారిగా రైతులను అయోమయానికి గురి చేయలేమని.. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కతాటిపైకి వచ్చి పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి నిరంజన్(Telangana Agriculture Minister Niranjan Reddy) అభిప్రాయపడ్డారు. పక్కా ప్రణాళికతో నెమ్మదిగా రైతులను సేంద్రీయ సాగువైపు మళ్లించాలని చెప్పారు. సాధారణంగా 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతు వేదిక నిర్మించామని.. కానీ కొన్ని ప్రాంతాల్లో అది 7వేలు, 9 వేల ఎకరాలకు ఒక క్లస్టర్​గా మార్చామని.. ప్రస్తుతం వాటిపై దృష్టి కేంద్రీకరించి.. వాటిని రేషనలైజ్ చేసి మిగతా ప్రాంతాల్లో రైతు వేదికలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలంలోని ఎనబావిలో మహిళా రైతులు 200 ఎకరాల్లో సేంద్రీయ సాగు చేసి కూరగాయలు పండిస్తున్నారు. పండించడమే కాదు.. వాళ్ల ఉత్పత్తులకు సహజ అనే పేరు పెట్టుకుని వారి ఉత్పత్తులు వాళ్లే విక్రయిస్తున్నారు. పండించిన పంటను సక్రమంగా మార్కెటింగ్​ చేసుకుంటే.. సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించవచ్చు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరఫున సేంద్రీయ సాగు వైపు ఆసక్తి చూపే రైతులకు కేవలం శిక్షణ మాత్రమే ఇస్తున్నాం. రానున్న రోజుల్లో ఆర్థికంగా చేయూతనివ్వడానికి చర్యలు తీసుకుంటాం.

- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

మన వద్ద 26వేల మిద్దె తోటలు

రాష్ట్రంలో అనేక మంది సేంద్రీయ సాగు వైపు మొగ్గు చూపుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana Agriculture Minister Niranjan Reddy) అన్నారు. చాలా మంది తమ మిద్దెలపై.. నివాసముంటున్న ప్రాంతాల్లో కాస్త స్థలం ఉన్నా.. వారికి కావాల్సిన కూరగాయలు వారే పండించుకుంటున్నారని తెలిపారు. ఇది వ్యవసాయ రంగంలో మంచి పరిణామంగా అభివర్ణించారు. రాష్ట్రంలో 26వేల మిద్దె తోటలు ఉన్నట్లు చెప్పారు. మిద్దె సాగు చేసే వారికి ఉద్యానశాఖ సబ్సిడీలు ఇస్తోందని పేర్కొన్నారు. మండలిలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా మంత్రి మిద్దె తోటలు సాగు చేయాలని.. వారున్న ప్రాంతంలో వారి కూరగాయలు వారే పండించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు.. ప్రజలకు ఆదర్శంగా నిలిచి.. మిద్దెసాగు వైపు మళ్లేలా దారిచూపాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.