ETV Bharat / city

జవహర్​నగర్​లో మంత్రి మల్లారెడ్డి పర్యటన

author img

By

Published : Apr 29, 2020, 5:27 PM IST

లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేస్తూ జీహెచ్​ఎంసీతో పాటు నగర చుట్టుపక్కల రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు. జవహర్​నగర్​ డంపింగ్​యార్డు లింక్​ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి, జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ పరిశీలించారు.

minister mallareddy visit jawahar nagar dumping yard works
జవహర్​నగర్​లో మంత్రి మల్లారెడ్డి పర్యటన

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని డంపింగ్​ యార్డ్​ నిర్మాణ పనులు... జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​తో కలిసి మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. దమ్మాయిగూడ నుంచి హరిదాస్​పల్లి వరకు హెచ్​ఆర్​డీసీఎల్​ నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్డును పర్యవేక్షించారు. జవహర్​నగర్​, దమ్మాయిగూడలో మంచి నీటి వసతి కోసం 10 నీటి ట్యాంకర్ల సదుపాయం కల్పించినట్టు మంత్రి తెలిపారు.

లాక్​డౌన్​ సమయాన్ని ఉపయోగించుకొని రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తామని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 114 కోట్ల వ్యయంతో క్యాపింగ్​ పనులు చేపట్టినట్టు వివరించారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అన్నపూర్ణ భోజన కల్పిస్తున్నట్టు మేయర్ తెలిపారు. మంత్రి వెంట జవహర్​నగర్​ మేయర్​ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా, దమ్మాయిగూడ మున్సిపల్​ ఛైర్మన్​ ప్రణీత, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: సంగారెడ్డిలో సద్దుమణిగిన లొల్లి.. శాంతించిన కార్మికులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.