ETV Bharat / city

'ఇది కేవలం అన్నదాతల పోరాటమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం..'

KTR Comments: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రైతులను రాష్ట్రం మోసం చేస్తోందని భాజపానేతలంటుంటే.. కేంద్రం, భాజపానేతలు నాటకాలాడుతున్నారని తెరాస నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా.. ఇది "రైతుల పోరాటమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం" పేరుతో ఓ వీడియో పంచుకున్నారు.

minister KTR twitter on TRS protest For Paddy Procurement in telangana

author img

By

Published : Apr 9, 2022, 5:42 PM IST

KTR Comments: యాసంగి వడ్ల కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేంద్ర వైఖరిపై పోరాటం మొదలు పెట్టిన తెరాస.. వివిధ కార్యక్రమాల ద్వారా తన నిరసనను తెలియజేస్తోంది. ఏప్రిల్​ 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రకరకాలుగా నిరసన స్వరం వినిపిస్తోన్న గులాబీ దళం.. 11న దిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమైంది. కాగా.. తాము చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. రైతుల మద్దతు కూడగట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్​.. తనదైన శైలిలో కేంద్ర, భాజపా నాయకులపై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్​ వేదికగా.. భాజపా నేతలు చెప్పిన మాటలు వాటిపై తెరాస నేతల స్పందనతో ఉన్న ఓ వీడియోను పంచుకున్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్దంగా లేదని రైతులకు సీఎం కేసీఆర్.. ముందే సూచించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. రైతులను రాష్ట్ర భాజపా నేతలు రెచ్చగొట్టి వరి వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా.. యాసంగి ధాన్యం చేతికొచ్చే సమయంలో కేంద్రం నాటకాలు చేస్తోందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం అని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.

  • యాసంగి వడ్లు కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా లేదని ముందే రైతులకు సూచించిన కెసిఆర్ !!

    రైతులను రెచ్చగొట్టి వరి వేయించి, ఇపుడు యసంగీ ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు చేస్తోంది!

    ఇది *అన్నదాత పోరాటం మాత్రమే కాదు* ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం* pic.twitter.com/zrmOpSWQZ4

    — KTR (@KTRTRS) April 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.