KTR tweet on Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో భాజపా అధికారంలోకి వస్తే రూ. 70 కే మద్యం విక్రయిస్తామన్న ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. వావ్.. వాట్ ఎ స్కీమ్.. వాట్ ఎ షేమ్ అంటూ వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఏపీ భాజపా నేతలు మరింతగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విటర్ వేదికగా విమర్శించారు. చీప్ లిక్కర్‌ను రూ. 50, రూ.70 కి విక్రయించడం భాజపా జాతీయ విధానమా లేక.. నిరాశావాదంలో కూరుకుపోయిన రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందా అని ప్రశ్నించారు.
సోము వీర్రాజు స్టేట్మెంట్
విజయవాడలో మంగళవారం జరిగిన భాజపా ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను కోటి ఓట్లతో గెలిపిస్తే.. లిక్కర్‌ను రూ. 70 కే విక్రయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ మెరుగ్గా ఉంటే రూ. 50 కే విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
-
Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low
— KTR (@KTRTRS) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu
">Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low
— KTR (@KTRTRS) December 29, 2021
National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNuWah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low
— KTR (@KTRTRS) December 29, 2021
National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu
ఇదీ చదవండి: Governor Tamilisai on Vaccination: టీకా ఒక్క డోసు తీసుకోవడంతో ఉపయోగంలేదు : గవర్నర్ తమిళిసై