ETV Bharat / city

'మా ప్రభుత్వం ఏ పనీ చేయకపోతే ప్రజల మద్దతు ఎలా ఉంటుంది'

రాష్ట్రంలో వెయ్యికి పైగా పట్టణ ప్రకృతి వనాలు ప్రారంభించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అన్ని పురపాలికల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏ పనీ చేయకపోతే ప్రజల మద్దతు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్​లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ktr
ktr
author img

By

Published : Sep 16, 2020, 3:57 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రూ.430 కోట్లతో మురికికాల్వలను బాగు చేస్తున్నామని పేర్కొన్నారు. పాతబస్తీలో మరిన్ని బస్‌ షెల్టర్లు, ఫుట్‌ పాత్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాడైన ఆటస్థలాలను వెంటనే బాగు చేస్తామని వెల్లడించారు.

11 వేల టాయిలెట్లు

అన్ని పురపాలకసంఘాల్లో ఎస్‌ఎస్‌టీపీలు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌లో వీధికుక్కలు, పందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రెండుచోట్ల కుక్కలకు బర్త్ కంట్రోల్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 11 వేల టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద ఎకో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. 2014 తర్వాత ఖమ్మం ఎలా మారిందో ప్రజలకు తెలుసు.

- కేటీఆర్‌

పనిచేయకపోతే ఎలా గెలుస్తాం

లక్కారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేసినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. భద్రకాళి ట్యాంకును అభివృద్ధి చేసింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. తమ ప్రభుత్వం ఏ పనీ చేయకపోతే ప్రజల మద్దతు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 130 పురపాలికలకు గాను 122 చోట్ల తెరాస ఛైర్మన్లు గెలిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లనూ తెరాస గెలిచిందన్నారు.

అంబేడ్కర్​ను కాంగ్రెస్​పట్టించుకోలేదు

బోధించు, సమీకరించు, పోరాడు అనేవి అంబేడ్కర్ నినాదాలని కేటీఆర్‌ తెలిపారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించింది ఎవరని కాంగ్రెస్​ను నిలదీశారు. అంబేడ్కర్‌ను ఓడించి పార్లమెంటుకు రాకుండా చేసింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ఏనాడు పట్టించుకోలేదు, గౌరవించలేదని విమర్శించారు. ఇప్పటికే బోరబండలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో 125 అడుగుల ఎత్తుతో ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం నెలకొల్పుతామని వెల్లడించారు.

ఇదీ చదవండి: త్వరలోనే వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తాం : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.