ETV Bharat / city

విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్​ - minister ktr on gouds

అన్ని కులస్తులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​లో గౌడ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు వచ్చిన ఆయన గౌడ కులస్తులకు వచ్చే బడ్జెట్​లో లూనా వాహనాలను అందిస్తామని తెలిపారు.

విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్​

author img

By

Published : Jan 4, 2020, 11:43 PM IST

వచ్చే బడ్జెట్‌లో గౌడ కులస్తులకు లూనా వాహనాలు అందించే పథకాన్ని తీసుకువస్తామని ఐటీశాఖ మంత్రి తారక రామారావు వెల్లడించారు. గౌడ సంఘం ఆర్థిక అభివృద్ధి సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే విధంగా నాలుగు రకాల విప్లవాలు తీసుకొచ్చి గ్రామీణ అర్థికాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ జలవిహర్‌లో రాష్ట్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్​
సన్మాన కార్యక్రమంలో నీరా చాలా బాగుందని.. విదేశీయులకు కూడా నీరా రుచి చూపిస్తామని మంత్రి పేర్కొన్నారు. అన్ని కుల వృత్తులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర సంపదను పెంచుతూ పేదలకు పంచాలన్నదే.. కేసీఆర్‌ ఆశయంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం జగన్ హ్యాట్సాఫ్ కేసీఆర్‌ అంటున్నారంటే మన రాష్ట్రం ఎంత ఆదర్శవంతంగా ఉందో అర్థమవుతోందని వివరించారు.

70 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీరా ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాణం పోసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో గౌడ కులస్తులది కీలకపాత్రగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్​ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.