ETV Bharat / city

KTR Vaccination: మొదటి డోసు టీకా తీసుకున్న కేటీఆర్​.. వ్యాక్సిన్ ఏంటని నెటిజన్ల ఆసక్తి

మంత్రి కేటీఆర్​ వ్యాక్సిన్​ తీసుకున్నారు. నేడు మొదటి డోసు టీకా తీసుకున్న మంత్రి.. తనకు వ్యాక్సిన్​ వేసిన వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే రాష్ట్రంలో ఎంతో మందికి టీకాలు వేస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ప్రశంసించారు.

Minister KTR first dose Vaccination completed

author img

By

Published : Jul 20, 2021, 8:03 PM IST

Updated : Jul 20, 2021, 8:28 PM IST

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్... కరోనా టీకా వేసుకున్నారు. టీకా మొదటి డోసు తీసుకున్న కేటీఆర్.. వ్యాక్సిన్​ వేసుకున్న ఫొటోను ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు. తనకు వ్యాక్సిన్​ వేసేందుకు సహకరించిన వైద్యులు, టీకా వేసిన నర్సును కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఎంతో మందికి టీకాలు వేస్తూ... విలువైన సేవలు అందిస్తున్న సిబ్బంది అందరికీ ట్విట్టర్​ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

వాళ్లందరికీ థాంక్యూ...

"ఈరోజు నా మొదటి కర్తవ్యాన్ని నెరవేర్చాను. నాకు టీకా వేసిన నర్సు కెరినా జ్యోతి... సహకరించిన వైద్యులు డా. శ్రీకృష్ణకు ధన్యవాదాలు. వీళ్లతో పాటు ఫ్రంట్​లైన్​ వారియర్లుగా విశేష సేవలందిస్తోన్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు."- కేటీఆర్​, మంత్రి

ఇంత లేట్​గానా...?

మంత్రి కేటీఆర్​ చేసిన పోస్టుకు ఎంతో మంది నెటిజన్లు స్పందించారు. వ్యాక్సిన్​ తీసుకున్నాక కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని... పలువురు జాగ్రత్తలు చెప్పారు. మరికొంత మంది ఆయన వేసుకున్న వ్యాక్సిన్ ఏంటని ఆసక్తిగా అడిగారు. ఇంకొందరు.. ఇప్పటికే చాలా లేటయిందని నిట్టూరిస్తే..​ దానికి సమాధానాలిచ్చే పనిలో మరికొంత మంది ట్వీట్లు చేశారు.

అందుకే లేటైంది...

ఏప్రిల్​ 23న మంత్రి కేటీఆర్​.. కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్​లో ఉండి కోలుకున్నారు. కరోనా సమయంలో తనకు కూడా తీవ్ర ఇన్​ఫెక్సన్​ సోకినట్లు మంత్రి ట్విట్టర్​ వేదికగా తెలిపారు. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మహమ్మారిని జయించగలిగానని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలని సూచించిన కేటీఆర్​.. కరోనా బారిన పడటం వల్ల ఇన్ని రోజులు వ్యాక్సిన్​ వేసుకోలేదు. కరోనాను జయించిన అనంతరం మూడు నెలల తర్వాత వ్యాక్సిన్​ వేసుకోవచ్చన్న వైద్యుల సూచన మేరకు.. నేడు టీకా మొదటి డోసును మంత్రి తీసుకున్నారు.

ఇదీ చూడండి: యోగా చేస్తుండగా ప్రమాదం- ఆసుపత్రిలో మాజీ మంత్రి

Last Updated : Jul 20, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.