భారతీయ జనతా పార్టీ నేతల నుంచి 12 కోట్ల ఉద్యోగాల వివరాల కోసం వేచిచూస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. నియామకాలపై ఇటీవల రాసిన బహిరంగ లేఖతో కూడిన ట్వీట్‌ను జత చేసిన కేటీఆర్... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నియమాకాల విషయంలో విపక్షాలు తెరాసను విమర్శిస్తుండగా... మంత్రి కేటీఆర్ ఇటీవలే బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు ప్రకటించిన కేటీఆర్... ఇప్పుడు భాజపా నేతలను తనదైన శైలిలో సవాల్ చేస్తూ ట్వీట్ చేశారు.