డయాగ్నస్టిక్స్ హబ్స్‌కు తెలంగాణ... వెలుగుదివ్వెగా మారిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రానికి మరో 16కు పైగా డయాలసిస్ హబ్‌లు అందుబాటులోకి రాబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే 19 డయాలసిస్ హబ్‌లలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. వాటిల్లో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారన్నారు.
డయాలసిస్ హబ్‌లను పర్యవేక్షిస్తున్న వైద్యశాఖ కమిషనర్ కరుణ.. ఆమె బృంద వైద్యులైన అరుణ్, నందిత, ప్రసాద్‌కు... కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. డయాగ్నస్టిక్స్ సంబంధించిన రక్త శాంపిళ్లను స్థానిక పీహెచ్సీలలో సేకరించి.. వాటి పరీక్షలను కేంద్ర హబ్‌లో నిర్వహిస్తారన్నారు. రిపోర్టు ఫలితాలు నేరుగా రోగుల మొబైల్ ఫోన్లకే వస్తాయని.. వాటికి సంబంధించిన హార్డ్ కాపీని సైతం ఫోన్‌కు తెలియజేస్తారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.