కాళేశ్వరంపై కాంగ్రెస్, భాజపా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు అని చెప్పి తుమ్మడిహట్టికి వెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగింది ఒకచోటయితే మరోచోట పరిశీలిచండం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద పర్యటించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: రైతుల పొలాలు పచ్చగా.. కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రగా..