'కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్య' - telangana assembly meetings
రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 604 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించామన్న మంత్రి... మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. 4 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నట్లు మంత్రి అసెంబ్లీలో వివరించారు.
minister koppula eeswar on residencial schools in assembly
ఇదీ చూడండి: ప్రశ్నోత్తరాల తర్వాత రెవెన్యూ బిల్లులపై చర్చ