రైతు సమస్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తుంటే... అనుభవ రాహిత్యంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి ఊరిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'లాక్డౌన్ ముసుగులో యువతకు ఉగ్రమూకల ఎర'