ETV Bharat / city

క్రైస్తవ మతపెద్దలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం - KOPPULA

సచివాలయంలో క్రైస్తవ మతపెద్దలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. శ్మశానవాటిక, కులధ్రువపత్రాల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కోకాపేటలో స్థలం ఎంపిక చేశామని త్వరలో భవనానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

క్రైస్తవ మతపెద్దలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం
author img

By

Published : Jul 25, 2019, 5:45 PM IST

అన్ని మతాల వారికి న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సచివాలయంలో క్రైస్తవమత పెద్దలతో మంత్రి సమావేశమయ్యారు. సమష్టి నిర్ణయం లేనందుకే భవన నిర్మాణంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. కోకాపేటలో స్థలం ఎంపిక చేశామని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తామన్నారు. శ్మశానవాటిక, కుల ధ్రువపత్రాల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పలువురు క్రైస్తవ మతంలో ఉంటూ ఎస్సీలుగా కొనసాగుతున్నారని త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్​రావు ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

క్రైస్తవ మతపెద్దలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం

ఇవీ చూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో విదేశీ సామాగ్రి సీజ్​

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.