ETV Bharat / city

కశ్మీర్​లో పరిణామాలపై సమాధానాలిచ్చిన కిషన్​రెడ్డి - jammu kashmir

అధికరణ 370 రద్దు తర్వాత కశ్మీర్​లో పరిణామాలపై లోక్​సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన 18 మందిపై ఎన్​ఐఏ ఛార్జిషీట్​ దాఖలు చేసిందన్నారు.

కశ్మీర్​లో పరిణామాలపై సమాధానాలిచ్చిన కిషన్​రెడ్డి
author img

By

Published : Nov 19, 2019, 10:49 PM IST

జమ్మూకశ్మీర్​లో ​ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలపై అడిగిన ప్రశ్నలకు లోక్​సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 190 రాళ్లు విసిరిన కేసుల్లో 765 మందిని అరెస్టు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల నుంచి ఎల్వోసీ వద్ద 955 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని... 370 రద్దు తరువాత పాఠశాలల్లో విద్యార్థుల పరీక్షలకు హాజరు శాతం 99.7 ఉందని పేర్కొన్నారు.

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన 18 మందిపై ఎన్​ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసిందని... గడిచిన ఆరు నెలల్లో టూరిజం ద్వారా జమ్మూకశ్మీర్​ 25 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు కేంద్రం వెల్లడించింది.

కశ్మీర్​లో పరిణామాలపై సమాధానాలిచ్చిన కిషన్​రెడ్డి

ఇవీ చూడండి: కాలుష్యంపై లోక్​సభలో చర్చ- ఆప్​ సర్కారుపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.