ETV Bharat / city

సమష్టి కృషితో ముందుకెళితేనే హరితహారం విజయవంతం: మంత్రి

ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేఖలు రాశారు. ఈ నెల 25న మెదక్‌ జిల్లా నర్సాపూర్​లో మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చూడతారన్నారు. 30 కోట్ల మొక్కలు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.

minister indrakaran reddy
minister indrakaran reddy
author img

By

Published : Jun 23, 2020, 6:27 PM IST

ఈ నెల 25న ప్రారంభంకానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో అందరికీ భాగస్వామ్యం కల్పించి విజయవంతం చేయాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. నాటిన మొక్కలను సంరక్షించేలా చూడాలని మంత్రి కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

లక్ష్యానికి చేరువలో...

రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్... రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు182 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి వివరించారు. పట్టణాలు, గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు.

ఈసారి లక్ష్యం 30కోట్లు

జంగిల్ బచావో, జంగిల్ బడావో (ఉన్న అడవిని కాపాడాలి, పోయిన అడవిని పునరుద్ధరించాలి) అని సీఎం కేసీఆర్ ఇచ్చిన నినాద స్ఫూర్తితో ప్రజా ప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో మ‌మేక‌మై మొక్కలు నాటి సంరక్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చూడతారన్నారు. 30 కోట్ల మొక్కలు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: అమెజాన్​లోనూ ఇక మద్యం హోం డెలివరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.