భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. ప్రణబ్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు. ఆర్థికవేత్తగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప నాయకుడు అన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్‌కు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం మొత్తం ప్రణబ్ ముఖర్జీ సేవలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు.
ఇవీచూడండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం