ETV Bharat / city

ధరణి, కంట్రోల్​ రూం పనితీరును పరిశీలించిన సీఎస్​, మంత్రి ఈటల

ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 2,285 రిజిస్ట్రేషన్లు జరిగాయి. బీఆర్కే భవన్​లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్​ రూంను సీఎస్​, మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. పనితీరును సీఎస్​ సోమేశ్​ కుమార్... మంత్రికి వివరించారు.

minister eetala rajendar inspects dharani portal and control room in brk bhavan
ధరణి, కంట్రోల్​ రూం పనితీరును పరిశీలించిన మంత్రి ఈటల
author img

By

Published : Nov 9, 2020, 9:35 PM IST

ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 8,488 రిజిస్ట్రేష్లన్లు పూర్తయ్యాయి. మొదటి రోజు కేవలం 507 రిజిస్ట్రేషన్లు కాగా... ఆ సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2,285 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 556, మెదక్ లో 551, రంగారెడ్డిలో 463, నల్గొండలో 446 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ధరణి పోర్టల్​ను75.70 లక్షల మంది వీక్షించారు. 14,546 మంది స్లాట్లు బుక్​ చేసుకోగా... రూ. 18.60 కోట్లు చెల్లించారు.

బీఆర్కే భవన్​లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ధరణి పోర్టల్, కంట్రోల్ రూం పనితీరును మంత్రికి సీఎస్ సోమేశ్​ కుమార్ వివరించారు. వందమంది సిబ్బంది ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నారని, సీనియర్ అధికారులు వ్యక్తిగతంగా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: గ్రామపంచాయతీ పనుల పర్యవేక్షణకు యాప్స్ ఆవిష్కరణ: ఎర్రబెల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.