ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందుల కొరత, కొవిడ్ చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరా, అజిత్రోమైసిన్, డాక్సీ సైక్లిన్, డాక్సామెతాసోన్ సరఫరాపై చర్చించారు.
విటమిన్- డి, సి, మల్టీవిటమిన్, జింక్ మందుల సరఫరాపై చర్చించారు. మందుల దుకాణాలు, ఆస్పత్రుల్లో సరిపడినన్ని ఉంచాలని మంత్రి ఈటల సూచించారు.