ETV Bharat / city

Anil kumar: తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారు

కృష్ణానది నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ అక్రమ ప్రాజెక్టులు కడుతోందన్న తెలంగాణ ఆరోపణలను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ కొట్టి పారేశారు. రాయలసీమలో కడుతున్న ప్రాజెక్టులన్నీ చట్టానికి లోబడినవేనని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన నీటికి మించి చుక్క నీరుకూడా అదనంగా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. 6 టీఎంసీలకు పైగా సామర్థ్యమున్న పలు ప్రాజెక్టులను తెలంగాణ అనుమతి లేకుండా నిర్మిస్తోందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్‌ పెడితే.. తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏపీ మంత్రి హాట్​ కామెంట్స్
ఏపీ మంత్రి హాట్​ కామెంట్స్
author img

By

Published : Jun 21, 2021, 4:33 PM IST

Updated : Jun 21, 2021, 7:56 PM IST

చట్టానికి లోబడే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అనిల్‌కుమార్‌ వెల్లడించారు. కృష్ణా నది నుంచి చుక్కనీరు కూడా ఎక్కువ తీసుకోవడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్‌ పెడితే.. తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని.. ఆర్‌డీఎస్‌ (RDS)కు సంబంధించి ఏపీకి 4 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏపీలో ఎక్కడా ప్రాజెక్టులు అక్రమంగా కట్టడం లేదన్న మంత్రి అనిల్​... తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు. నీళ్లు అక్రమంగా తరలిస్తున్నారనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఏపీకి కేటాయించిన జలాలు తీసుకెళితే ఏవిధంగా తప్పవుతుందని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్​ కాపాడుతున్నారని మంత్రి అన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార జల వివాదాల ట్రైబ్యునల్‌ అనుమతి కావాలన్నారు.

చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి..

చట్టానికి లోబడే రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని మంత్రి అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఏపీకి కేటాయించిన నీటి వాటాకు లోబడే ఈ నిర్మాణాలు ఉంటాయన్నారు. శ్రీశైలంలో 881 అడుగులుంటేనే పోతిరెడ్డిపాడు(pothireddypadu) నుంచి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీశైలంలో 848 అడుగులుంటే చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులను 15 రోజులే తీసుకునే పరిస్థితి ఉందని.. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్టు ఏర్పాటు తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మంత్రి అనిల్ కామెంట్స్

సుంకేశుల ప్రాజెక్టు సక్రమమైందా.. ?

కృష్ణా నది నుంచి చుక్కనీరు కూడా మేం ఎక్కువ తీసుకోవడం లేదు. 6 టీఎంసీల సామర్థ్య ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోంది. శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగులున్నా లిఫ్ట్‌ చేసేలా తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయి. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు సామర్థ్యం పెంచారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ లిఫ్టు ఏర్పాటు చేశారు. సుంకేశుల వద్ద తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు సక్రమమైందా.. ? మీరు చేస్తే తప్పులేదు.. మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా..? మా రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు కట్టడం లేదు. కృష్ణా నుంచి సరిపడా నీరు తీసుకునేందుకే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నాం.

- అనిల్ కుమార్ యాదవ్, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని మంత్రి అనిల్ (minister anil) వివరించారు. భవిష్యత్తులోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారుల స్థాయిలో నీటి సమస్యలు పరిష్కారం కావన్న ఆయన.. నీటి వాటాలపై ఐదేళ్లుగా మేం పోరాడుతూనే ఉన్నామన్నారు. నీటి సమస్య పరిష్కారానికి ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటారని చెప్పారు.

ఇదీ చదవండి: KCR: ఓరుగల్లులో సీఎం... మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ

Last Updated : Jun 21, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.