ETV Bharat / city

చలిపంజా: లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు - విశాఖపట్నం వార్తలు

రెండు రోజులుగా ఏపీ విశాఖలోని పాడేరు ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. స్థానికులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

చలిపంజా: లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
చలిపంజా: లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
author img

By

Published : Dec 22, 2020, 12:04 PM IST

ఏపీ విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో గత 2 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 6, మినుములూరులో 7, చింతపల్లిలో 8, పాడేరులో 8 డిగ్రీలు నమోదయ్యాయి. నరాలు కొరికే చలితో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు.

చలి మంటలు వేసుకుంటే గాని ఉపశమనం లభించడం లేదు. ఈ పరిస్థితితో విద్యార్థులు, ఉద్యోగస్థులు, కూలి పనివారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరో వారం రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇదీ చదవండి: 'కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలే..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.