ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వంశీమోహన్ స్వర్ణకారుడు. అనారోగ్యంతో బాధపడుతూనే.. వృత్తి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఖాళీ సమయాల్లో అందుబాటులో ఉన్న వస్తువులతో సూక్ష్మ నమూనాలు తయారుచేస్తూ.. ప్రతిభను చాటుకుంటున్నారు. వంశీ రూపొందించిన కళాఖండాల్లో.. అయోధ్య రామ మందిరం విశేషంగా ఆకట్టుకుంటోంది. దానిలో స్తంభాలు, గోపురం, గర్భాలయం, ప్రాకారం వంటివి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్తంభాలను ప్రత్యేక డిజైన్లతో తయారు చేసి.. విద్యుత్ దీపాలంకరణ సైతం ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణంలో ఎకలిక్ ప్లాస్టిక్, కార్డ్‌బోర్డ్, ఫోమ్, కలప, సన్‌గ్లాస్ వంటివి ఉపయోగించారు. ఐదు నెలల కాలంలో రూ.20 వేల ఖర్చుతో ఈ అద్భుత కళాఖండాన్ని రూపొందించినట్లు వంశీ తెలిపారు.
'ఖాళీ సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో నేను అయోధ్య రామమందిరాన్ని తయారు చేశా. అయోధ్యలోని రామమందిరం సిద్ధం కావడానికి 2025 వరకు సమయం పడుతుంది. దానికంటే ముందే మన ఆలయం సిద్ధం కావాలని ఈ ఆలయాన్ని తయారు చేశాను. అయోధ్య రామాలయం నిర్మాణానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది. ఇంకా నెల రోజుల పని ఉంది. రామాలయం నిర్మాణంలో చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా ఇంకా సమయం పడుతుంది. ఇప్పటికే చాలా మంది దాతలు సాయం అందించారు. మరికొందరు ముందుకొస్తారని ఆశిస్తున్నాను' - వంశీ, కళాకారుడు
చార్మినార్, రైల్వేస్టేషన్, రైలు, ఇంటి నమూనాలు సైతం తయారు చేశారు. ఏలూరు రైల్వేస్టేషన్ నమూనాను అందంగా తీర్చిదిద్దారు. ప్లాట్‌ఫాం, ట్రాక్, రైలు రూపొందించారు. రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫామ్‌లకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కొన్ని సూక్ష్మ నమూనాలను మిత్రులకు బహుమతులుగా ఇస్తుంటారు. వంశీమోహన్ కళను గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఆయన మిత్రులు కోరుతున్నారు.
ఆరోగ్య సమస్యలు ఉన్నా.. కళ మీద ఉన్న ఇష్టంతో కళాకృతులను తయారు చేస్తున్నాడు. చాలామంది దాతలు వంశీ కళను ముందుకు తీసుకువెళ్లారు. ప్రభుత్వం కూడా వంశీ కళను గుర్తించి సాయం చేస్తుందని కోరుకుంటున్నాం. -వంశీ స్నేహితులు
అనారోగ్యంతో బాధపడుతున్నా.. సూక్ష్మ నమూనాల తయారీలో ప్రతిభ కనబరుస్తూ వంశీమోహన్ అందరి ప్రశంసలూ పొందుతున్నారు.
సంబంధిత కథనాలు..
- 'అయోధ్య'ను తలపించేలా గణేశ్ ఆలయం
- అగరబత్తి పుల్లలతో త్రీడీ అయోధ్య రామమందిరం
- 60వేల నాణేలతో అయోధ్య రాముడు
- అయోధ్య మసీదు ఆకృతి విడుదల
- 'అయోధ్య గుడి నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు!'
- శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం
ఇదీ చూడండి: KTR: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను ఏవియేషన్ వర్సిటీగా మార్చాలి