ETV Bharat / city

'సీఏఏ, ఎన్​ఆర్​సీలతో దేశం బలహీనపడే ప్రమాదం'

ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్యను సృష్టిస్తోందని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడారు.

author img

By

Published : Mar 16, 2020, 12:28 PM IST

Updated : Mar 16, 2020, 12:47 PM IST

mim mla akbaruddin owaisi says thanks to telangana cm kcr as he introduced a resolution against caa
ఎన్​ఆర్​సీతో పౌరులు కాని వారికీ పౌరసత్వం వస్తోంది
'సీఏఏ, ఎన్​ఆర్​సీలతో దేశం బలహీనపడే ప్రమాదం'

సీఏఏ, ఎన్​ఆర్​సీలతో దేశం బలహీనపడే ప్రమాదముందని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్య సృష్టిస్తోందని, పౌరుడి కాని వారికి పౌరసత్వం వస్తుందని, దేశ పౌరుడికి పౌరసత్వం పోతుందని చెప్పారు.

అమాయకులు ప్రాణాలు కోల్పోయారు...

సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ చట్టం ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఉత్తరప్రదేశ్‌లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

కేసీఆర్​కు కృతజ్ఞతలు...

సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి అక్బరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే తెరాసతో కలిసి ఉన్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూస్తోందన్నారు.

Last Updated : Mar 16, 2020, 12:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.