ETV Bharat / city

Telangana Weather Updates : భానుడి భగభగ.. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ హెచ్చరిక - telangana weather updates

Telangana Weather Updates : ఎండ వేడిమి అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు మంగళవారం కాస్త ఊరట కలిగింది. ఇన్నాళ్లూ వడగాలుల దడకు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు నిన్న కురిసిన వానతో చల్లగాలులు పీల్చుకున్నారు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీ చేసింది.

Orange Alert in North Telangana
Orange Alert in North Telangana
author img

By

Published : Mar 23, 2022, 7:06 AM IST

Telangana Weather Updates : సూర్యతాపానికి తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమి.. వడగాలుల దడ.. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని.. ఆ ప్రాంత ప్రజలు వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతే తప్ప మిట్ట మధ్యాహ్నం బయట తిరగకూడదని చెప్పింది. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీ చేసింది.

Temperature in Telangana : ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ మంగళవారం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం పగలు కొన్నిచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మిరాస్‌పల్లి(వనపర్తి జిల్లా)లో 1.3, పెబ్చేరులో 1.1, పర్పల్లి(మహబూబ్‌నగర్‌)లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా కాటారం(జయశంకర్‌ జిల్లా)లో 41.9, అత్యల్పంగా బజార్‌హత్నూర్‌(ఆదిలాబాద్‌)లో 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.