ETV Bharat / city

బిల్లుల ఆమోదం కోసం నేడు మండలి ప్రత్యేక భేటీ.. - తెలంగాణ శాసనమండలి

శాసనసభ ఆమోదించిన నాలుగు చట్టసవరణలు ఇవాళ పెద్దలసభ ముందుకు రానున్నాయి. ఇందుకోసం శాసన మండలి ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేవలం బిల్లులకు ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ఇతర అంశాలపై చర్చకు అవకాశం లేదు.

Member of Legislature council meet Today at 11 am to implement four acts
బిల్లుల ఆమోదం కోసం నేడు మండలి ప్రత్యేక భేటీ..
author img

By

Published : Oct 14, 2020, 5:07 AM IST

శాసనమండలి ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది. అసెంబ్లీలో మంగళవారం ఆమోదం తెలిపిన నాలుగు బిల్లులను ప్రభుత్వం కౌన్సిల్​లో ప్రవేశపెట్టనుంది. స్టాంపు, నాలా చట్టాలకు సవరణ బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెడతారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, సీఆర్పీసీ చట్టసవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెడతారు. బిల్లుల ఆమోదం కోసం వెంటనే చర్చ కూడా చేపడతారు. చట్టసవరణ బిల్లుల ఆమోదంతో ప్రత్యేక సమావేశాలు ముగుస్తాయి.

ప్రశ్నోత్తరాలు రద్దు

11 గంటలకు సభ ప్రారంభం కాగానే నేరుగా బిల్లులు ప్రవేశపెడతారు. ఆమోదం తరువాత సభ వాయిదా పడుతుంది. ఎలాంటి ఇతర అంశాలపై చర్చకు అవకాశం లేదు. ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేస్తూ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే బులెటిన్ జారీ చేశారు.

ఇదీ చూడండి:ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.