ETV Bharat / city

వైద్య పరికరాల తయారీలో 'మెడ్‌ట్రానిక్స్' రూ.1,200 కోట్ల పెట్టుబడి - medtronics to locate r and d centre in hyderabad

medtronics to invest 1200 cores on telangana
వైద్య పరికరాల తయారీలో రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెడ్‌ట్రానిక్స్
author img

By

Published : Aug 11, 2020, 7:16 PM IST

Updated : Aug 11, 2020, 8:17 PM IST

19:13 August 11

వైద్య పరికరాల తయారీలో రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెడ్‌ట్రానిక్స్

వైద్య పరికరాల తయారీలో ప్రఖ్యాత సంస్థ మెడ్​ట్రానిక్స్​ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా అవతల తన రెండో అతిపెద్ద ఆర్​ అండ్ డీ కేంద్రాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.  

ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్​గా ఏర్పడే అవకాశాలు హైదరాబాద్ నగరానికి ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, మెడ్​ట్రానిక్స్ కంపెనీ గత రెండేళ్లుగా ఇందుకు సంబంధించిన చర్చలను కొనసాగిస్తున్నాయి. 2016లో అమెరికాలో పర్యటించిన సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ బృందం.. మెడ్​ట్రానిక్స్​ ఛైర్మన్​ ఓమర్ ఇస్రాక్​తో సమావేశమైంది. ఇవాళ ఆ సంస్థ ఛైర్మన్​తో కేటీఆర్​ వర్చువల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పెట్టుబడికి సంబంధించి కంపెనీ ప్రకటన చేసింది.  

కేటీఆర్​ హర్షం..

మెడ్​ట్రానిక్స్ కంపెనీ తన అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రానికి గమ్యస్థానంగా హైదరాబాద్​ను ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్​ విశ్వాసం వ్యక్తం చేశారు.  

ఇవీచూడండి: నీటిపారుదల రంగం ఇకపై జలవనరుల శాఖ: కేసీఆర్​

Last Updated : Aug 11, 2020, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.