హైదరాబాద్ ఐఎస్ డివిజన్ సింగరేణి కాలనీని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. అపార్ట్మెంట్లో ఉన్నవారికి పాల ప్యాకెట్లు, మంచినీరు, ఆహారం అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేయర్ ముందు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.
వరద ప్రాంతంలోని పలువురిని ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో స్థానిక కార్పొరేటర్ సప్న రెడ్డి వేరే ప్రాంతాలకు తరలించారు. డివిజన్లలోని కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని మేయర్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు.