ఆంధ్రప్రదేశ్లో... ప్రసూతి మరణాల సంఖ్య తగ్గింది. 2014-16 మధ్యకాలంలో సగటున లక్ష ప్రసవాలకు 74 మంది మృత్యువాత పడగా.. 2016-18 వ్యవధిలో ఆ సంఖ్య 65కు తగ్గినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 130 నుంచి 113కు తగ్గింది. నిర్దేశిత కాలంలో దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది.
మొదటి స్థానంలో కేరళ(43) నిలవగా మహారాష్ట్ర(46), తమిళనాడు(60), తెలంగాణ(63) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా మాతృ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో అసోం(215) మొదటిస్థానంలో ఉంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలతో(126) పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో (67) ఈ సంఖ్య తక్కువగా ఉంది.
ఇదీ చదవండి: