ETV Bharat / city

జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల్లో చూచిరాతలు - mass copying in JNTUH exams in Telangana

కాసులకు కక్కుర్తిపడిన కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి కాపీయింగ్‌కు ప్రోత్సహించాయి. ఫలితంగా విద్యార్థులు పుస్తకాలు పక్కన పెట్టుకొని పరీక్షలు రాసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జేఎన్‌టీయూహెచ్‌కు కూడా ఫిర్యాదులు అందటంతో అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు.

mass copying in jntuh exams came to light
జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల్లో చూచిరాతలు
author img

By

Published : Dec 19, 2020, 7:08 AM IST

రాష్ట్రంలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఎంటెక్‌ ప్రథమ సంవత్సర పరీక్షలతోపాటు బ్యాక్‌లాగ్‌ పరీక్షలు రెండు రోజుల క్రితం ముగిశాయి. కరోనా కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడరాదని ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో పరీక్షలు రాసుకునేలా సెల్ఫ్‌ సెంటర్‌ సౌకర్యం కల్పించారు. ఇదే అదనుగా భావించిన కొన్ని కళాశాలల సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకు ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేసి పుస్తకాలు పెట్టుకొని చూసి రాసుకునే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.

గతంలో ఫెయిలయి తిరిగి ఇప్పుడు ఆ పరీక్షలు(బ్యాక్‌లాగ్‌లు) రాసే విద్యార్థుల నుంచి ఇంకా ఎక్కువ వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు జవాబుపత్రాలను మొబైల్‌లో ఫొటోలు కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ కళాశాలపై గతంలోనూ పలు రకాల ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 10-20 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కాపీయింగ్‌ జరిగినట్లు అంచనా. మూల్యాంకనం సందర్భంగా కాపీయింగ్‌పై తేలుస్తామని అధికారులు చెబుతుండగా... బోర్డుపై రాసి దానిని అందరూ రాసుకుంటేనే జవాబులు ఒకేరకంగా ఉంటాయని, పుస్తకాలు పెట్టుకొని రాసుకుంటే ఒకేలా ఉండవని నిపుణులు చెబుతున్నారు. గత పరీక్షల్లో ఉత్తీర్ణత, ఈసారి ఉత్తీర్ణత చూస్తే స్పష్టంగా తేడా కనిపిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.

తనిఖీల్లోనూ బట్టబయలు !

పరీక్షలు జరుగుతున్నప్పుడే కొన్ని కళాశాలలపై ఫిర్యాదులు రావడంతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్లను పంపి వర్సిటీ తనిఖీలు చేయించింది. ఆ సందర్భంగా రెండు మూడు కళాశాలల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వాటిల్లో ఒక్కోచోట 10-20 మందిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేసినట్లు వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు ఇతర కళాశాల నుంచి ఒకరిని పరిశీలకునిగా నియమించారు. వారికి పలు కళాశాల సిబ్బంది రోజుకు రూ.10 వేల చొప్పున ముట్టజెప్పడంతో పరిశీలకులు కూడా చూచిరాతలను పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.

‘‘మాకు రెండు కళాశాలలపై ఫిర్యాదులు వచ్చాయి. కాపీయింగ్‌ జరిగితే ఒకే రకంగా జవాబులు ఉండే అవకాశం ఉంది. అందుకే మూల్యాంకనం సమయంలో ఆ కళాశాల జవాబుపత్రాలను ప్రత్యేకంగా దిద్దించాలని అధికారులను ఆదేశించాను. అంతేకాకుండా కళాశాలల్లో నియమితులైన పరిశీలకులను నివేదిక కోరాం’’అని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.