ప్రపంచ సరాసరితో పోల్చితే... సీఎఫ్ఓ, సీఈఓ, సీఓఓ స్థాయిలో భారత మహిళలు నాలుగున్నర శాతం అధికంగా ఉన్నారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ నిర్వహించిన 'మహిళల నాయకత్వ అభివృద్ధి ప్రోగ్రాం' ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఆర్థిక అంశాలపరంగా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో పురుషులతో సమానంగా పాల్గొంటే... జీడీపీ 27శాతం పెరుగుతుందని తెలిపారు. ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలనే లక్ష్యంతో మహిళలు ముందుకెళ్లాలని సూచించారు. ప్రతిక్షణం కుటుంబంతో మమేకమై.. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ నిర్మాణాత్మకంగా లక్ష్యాలు సాధించాలని తెలిపారు. జీవితంలో బలమైన లక్ష్యాలు నిర్ధేశించుకుని దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అభివృద్ధిలో శాంతిభద్రతల పాత్ర కీలకం: మంత్రి మహమూద్ అలీ