ETV Bharat / city

'పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల‌ను విడిచిపెట్టాలి'

author img

By

Published : Mar 24, 2021, 5:12 AM IST

పోలీసుల అదుపులో ఉన్న ఇద్ద‌రు మావోయిస్టుల‌ను విడిచి పెట్టాల‌ని... మావోయిస్టు పార్టీ ఎంకేవీబీ డివిజ‌న్ కార్య‌ద‌ర్శి కైలాసం డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక ఆదివాసీల‌తో న్యాయ‌పోరాటం చేస్తామ‌ని కైలాసం స్పష్టం చేశారు.

'పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల‌ను విడిచిపెట్టాలి'
'పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల‌ను విడిచిపెట్టాలి'

ఒడిశా పోలీసుల అదుపులో ఉన్న ఇద్ద‌రు మావోయిస్టుల‌ను విడిచి పెట్టాల‌ని... మావోయిస్టు పార్టీ ఎంకేవీబీ డివిజ‌న్ కార్య‌ద‌ర్శి కైలాసం డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న విలేక‌రుల‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఒడిశాకు చెందిన మ‌ల్క‌న్‌గిరి పోలీసులు క‌టాఫ్ ఏరియా ప్రాంతంలో రమా, మ‌యి అనే ఇద్దరిని ప‌దిరోజులు కిందట బొయిప‌రిగుడా మ‌డ‌క్‌పొద‌ర్‌ - మ‌జ్జిగుడా ద‌గ్గ‌ర ప‌ట్టుకున్నారని తెలిపారు.

ఆ ఇద్దరిని ప‌ట్టుకుని ప‌ది రోజులుగా పోలీసులు విస్తృతంగా గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్నారని ఆరోపించారు. ఇది చ‌ట్ట‌రీత్యా నేర‌మని స్పష్టం చేశారు. మ‌ల్క‌న్‌గిరి జిల్లా పోలీసులు వెంట‌నే వీరిని న్యాయస్థానంలో హాజ‌రుప‌ర్చాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక ఆదివాసీల‌తో న్యాయ‌పోరాటం చేస్తామ‌ని... మావోయిస్టు పార్టీ ఎంకేవీబీ డివిజ‌న్ కార్య‌ద‌ర్శి కైలాసం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'త్వరలోనే.. రాష్ట్రంలో ఫుడ్​ ప్రాసెసింగ్ యూనిట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.