దీపావళీ సందర్భంగా బాణాసంచా కాల్చిన సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల గాయపడిన బాధితులతో హైదరాబాద్లోని సరోజనిదేవి కంటి (Sarojini Devi eye hospital )ఆసుపత్రి కిటకిటలాడింది. పదుల సంఖ్యలో బాధితులు, చిన్నారులు కంటి గాయాలతో ఆస్పత్రి వద్ద క్యూ కట్టారు.
స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామని ఆస్పత్రి సీనియర్ కంటి వైద్యురాలు డాక్టర్ సునీత అన్నారు. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారని ఆమె పేర్కొన్నారు. బాణాసంచా ప్రమాదాలతో తీవ్రంగా గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి పంపించామన్నారు.
'ఉదయం నుంచి సాయంత్రం వరకు బాణాసంచా ప్రమాదాలతో 10 మంది కంటి ఆసుపత్రికి వచ్చారు. ఇద్దరిని అడ్మిట్ చేసుకున్నాం. మిగిలిన కేసులను ఓపీ బేసీస్లోనే ట్రీట్ చేశాం. ఇద్దరు చిన్నారులు అడ్మిట్ అయ్యారు.'
- డా.సునీత, డీఎంవో.
ఇవీచూడండి: Diwali celebrations in Telangana: ఘనంగా దీపావళి వేడుకలు.. గల్లీగల్లీలో టపాసుల మోతలు..