ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం గురురాఘవేంద్ర స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. కన్నడ నటి మీనాక్షి మంచాలమ్మ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి మూల బృందావనాన్ని సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఉపలోకాయుక్త న్యాయమూర్తి నిరంజన్‌రావు, దేవాదాయశాఖ ముఖ్య అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరికి మఠం పీఠాధిపతి సుబుదేవేంద్ర తీర్థులు ఆశీర్వచనాలు అందజేశారు.