ETV Bharat / city

ఇంటి పన్ను చెల్లించలేదని టీవీ ఎత్తుకెళ్లారు. - మణికొండ పురపాలకసంఘం వార్తలు

మీరు ఇంటి పన్ను కట్టలేదా? మీ ఇంట్లో టీవీ ఉందా? అయితే వెంటనే పన్ను చెల్లించండి. లేకుంటే అధికారులు ఏక్షణమైనా వచ్చి మీ టీవీ ఎత్తుకెళ్లొచ్చు. అధికారులు టీవీ తీసుకెళ్లడం ఏంటనుకుంటున్నారా? అయితే ఈ మణికొండ పురపాలక అధికారులు గురించి తెలుసుకోవాల్సిందే.

ఇంటి పన్ను చెల్లించలేదని టీవీ ఎత్తుకెళ్లారు.

author img

By

Published : Jun 20, 2020, 9:05 PM IST

ఇంటి పన్ను చెల్లించలేదని పురపాలిక అధికారులు ఓ ఇంట్లో టీవీని ఎత్తుకెళ్లారు. యజమాని అడ్డుకొని పన్ను బకాయి చెల్లించగా.. టీవీని వదిలేసి వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్ మణికొండ పురపాలికలో చోటుచేసుకుంది. సురేంద్రనాథ్ అనే ఐటీ ఉద్యోగి... పురపాలిక సంఘానికి 9 వేలు ఆస్తిపన్ను బకాయి ఉంది. మున్సిపల్ అధికారులు పన్ను చెల్లించాలని నోటీసులు పంపించారు. నోటీసులపై స్పందించిన వ్యక్తి.... అపార్ట్‌మెంట్‌లోని మిగతా వారికంటే తనకు ఎక్కువ పన్ను వేశారని ఆరోపించారు.

ఇంటి పన్ను చెల్లించలేదని టీవీ ఎత్తుకెళ్లారు.

బకాయిలు చెల్లించనందున.. ఇంటికి వెళ్లిన అధికారులతో సురేంద్రనాథ్‌ వాగ్వాదానికి దిగారు. పన్ను చెల్లించకుంటే ఇంట్లోని వస్తువులను జప్తుచేస్తామని.. ఇంట్లో ఉన్న టీవీని తొలిగించారు. కంగుతిన్న వ్యక్తి కాసేపటికి పన్ను చెల్లించాడు. ఈ విషయంపై అధికారులను ఈటీవీ వివరణ కోరగా... నిబంధనల ప్రకారమే పోలీసుల సమక్షంలో చర్యకు పాల్పడినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.